మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ డ్రామా చిత్రం ‘డ్రాగన్’ పై భారీ ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది ప్రారంభంలో రెండు భారీ షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. మొత్తం ప్రణాళికను బాగానే సిద్ధం చేసి జూన్ 2026 రిలీజ్ అనౌన్స్ చేశారు. అయితే గత ఆరు నెలలుగా షూటింగ్ పూర్తిగా ఆగిపోయింది. ఇదే కారణంగా పలు రకాల రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
ఎన్టీఆర్ బాగా సన్నబడటంపై ట్రోలింగ్ కూడా జరిగింది. సినిమా నిలిచిపోయిందా? లేదా ఎన్టీఆర్ ఇప్పటికే తీసిన కంటెంట్‌తో సంతృప్తిగా లేడా? అనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు ఆ అనుమానాలన్నింటికీ చెక్ పెడుతూ, ఆరు నెలల విరామం తర్వాత షూటింగ్ హైదరాబాద్‌లో పునఃప్రారంభం కానుంది. డిసెంబర్ – జనవరి నెలల్లో వరుసగా భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు.
కథలో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్లను ఈ సమయంలో చిత్రీకరించనున్నారు. షూట్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ భావిస్తోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
