ఎన్టీఆర్ ఆ రీమేక్ చేయడం లేదట !
Published on Jul 20, 2017 6:04 pm IST


ఒకవైపు ‘జై లవ కుశ’ చిత్ర షూటింగ్లోను, మరోవైపు రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తోనూ బిజీ బిజీగా ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. వీటి తర్వాత ఎన్టీఆర్ స్టార దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివలతో సినిమాలు చేయాల్సి ఉంది. ఇలా తారక్ లిస్టులో వరుస ప్రాజెక్ట్స్ ఉన్న తరుణంలో ఆయన మరొక కొత్త ప్రాజెక్ట్ ను సెట్ చేసుకునే పనిలో ఉన్నట్టు వార్తలొచ్చాయి. అది కూడా ఒక రీమేక్ కావడం ఇంకాస్త ఆసక్తి కలిగించే విషయం.

వివరాల్లోకి వెళితే కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన ‘రాజా కుమార’ చిత్రం ఇటీవలే విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమానే తారక్ రీమేక్ చేసే యోచనలో ఉన్నాడని ఆ వార్తల సారాంశం. కానీ తారక్ సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఆ ప్రాజెక్ట్ చేయడంలేదని రూఢీ అయింది. దీంతో రూమర్లకు చెక్ పడింది. ఇకపోతే ఆయన త్రిపాత్రాబినయం చేస్తున్న ‘జై లవ కుశ’ చిత్రం సెప్టెంబర్ 21న రిలీజ్ కానుంది.

 
Like us on Facebook