“RRR” ఎమోషనల్ సాంగ్ పై తారక్..ఇంకో ఇంట్రెస్టింగ్ ఇన్ఫో.!

“RRR” ఎమోషనల్ సాంగ్ పై తారక్..ఇంకో ఇంట్రెస్టింగ్ ఇన్ఫో.!

Published on Nov 23, 2021 7:27 PM IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు నటించిన భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం” నుంచి ఒక కీలకమైన ఎమోషనల్ సాంగ్ ని దర్శకుడు రాజమౌళి నిన్ననే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి దీనిపై ఇప్పుడు కొమరం భీం ఎన్టీఆర్ కూడా దీనిపై ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టడం జరిగింది.

‘జనని అనే ఈ ఎమోషనల్ సాంగ్ ని రాజమౌళి కన్విన్స్ చెయ్యడంతో కీరవాణి గారు ఇచ్చిన అద్భుతమైన కంపొజిషన్ ప్రతీ ఒక్కరినీ కూడా చాలా భావోద్వేగానికి లోను చేస్తుంది అని తారక్ తెలిపాడు. అలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ దీనిపై ఏమిటంటే ఈ సాంగ్ లిరికల్ గానే కాకుండా విజువల్ గా ఉంటుందట. దీనిని “RRR” యూనిట్ నే సోషల్ మీడియాలో కన్ఫర్మ్ చేసారు. మరి ఇదెలా ఉంటుందో తెలియాలి అంటే వచ్చే నవంబర్ 26 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు