మొన్న ‘ఊసరవెల్లి’ ఇపుడు ‘అతిథి’, ‘నేనొక్కడినే’.. అంచనాలు తలకిందులు.. కారణం?

మన తెలుగు సినిమా దగ్గర గత కొన్నాళ్ల కితం స్టార్ట్ అయ్యిన రీరిలీజ్ ల ట్రెండ్ ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. నిజానికి సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులే మొదలు పెట్టిన ఈ ట్రెండ్ ఇతర హీరోల ఫ్యాన్స్ కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఈ ట్రెండ్ లో మన స్టార్ హీరోల సినిమాలే ఇప్పుడు అండర్ పెర్ఫామ్ చేయడం అనేది ఆశ్చర్యంగా మారింది. కొన్ని సినిమాలు అయితే అనౌన్స్ చేసి పెద్దగా హంగామా చేయనప్పటికీ భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.

కానీ కొన్ని సినిమాలు మాత్రం ఎప్పుడో అనౌన్స్ చేసి పక్కా ప్లానింగ్ లు సినిమాలో మార్పులు చేర్పులు చేసినప్పటికీ రీరిలీజ్ లో ఎందుకో అంత ప్రభావం చూపించకుండా మిగిపోయాయి. ఇప్పుడు ఆ సినిమాలే ఎన్టీఆర్ ఊసరవెల్లి, మహేష్ బాబుల అతిథి ఇంకా 1 నేనొక్కడినే అని చెప్పవచ్చు.

ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ప్లాన్ చేసిన ఊసరవెల్లి రీరిలీజ్ ని ఎప్పుడో అనౌన్స్ చేసి మంచి హంగామా తోనే విడుదల చేశారు కానీ ఈ సినిమాకి ఓపెనింగ్స్ ఎంత వచ్చాయి అనేది కూడా ఎవరికీ తెలీదు. ఇదే పంథాలో అంతకు మించే ప్లానింగ్ తో అతిథి రీరిలీజ్ కి వచ్చింది. ఇది మాత్రం మహేష్ గత సినిమాల్లో బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ చూపించలేదు. చాలా తక్కువ బుకింగ్స్ ఒకటీ రెండు సింగిల్స్ సింగిల్ స్క్రీన్స్ లో తప్పితే ముందు చిత్రాల తరహాలో రెస్పాన్స్ అందుకోలేదు.

ఇంట్రెస్టింగ్ గా ఈ రెండు సినిమాల దర్శకుడు కూడా సురేందర్ రెడ్డినే కావడం గమనార్హం. ఇక వీటితో పాటుగా మహేష్ ప్లాప్ క్లాసిక్ చిత్రం 1 నేనొక్కడినే బుకింగ్స్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. మరి ఇందుకు కారణం ఏంటి అనేది మాత్రం అర్ధం కాలేదు. త్వరితగతిన రిలీజ్ కావడం వలనో లేక మొదటి నుంచీ ఫ్యాన్స్ లో ఈ సినిమాల పట్ల అంత ఆసక్తి లేదేమో కానీ వారి గత సినిమాలకి ఇచ్చిన రేంజ్ లో వీటికి రెస్పాన్స్ ఇవ్వలేకపోయారు.

Exit mobile version