వైరల్ : న్యూయార్క్ లో ఎంజాయ్ చేస్తున్నా అంటూ ఎన్టీఆర్ పోస్ట్.!

వైరల్ : న్యూయార్క్ లో ఎంజాయ్ చేస్తున్నా అంటూ ఎన్టీఆర్ పోస్ట్.!

Published on Dec 27, 2022 11:00 AM IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివతో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ లో ఇది 30 వ సినిమా కాగా దీనిపై భారీ స్థాయి అంచనాలు పాన్ ఇండియా వైడ్ ఉన్నాయి. ఇక ఈ చిత్రం షూట్ స్టార్ట్ కి ముందు అయితే తారక్ తన ఫ్యామిలీ తో కలిసి ఓ వెకేషన్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. మరి అలా తాను రోజుకో ఇంట్రెస్టింగ్ అంశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పంచుకుంటున్నాడు.

మరి అలా ఈరోజు అయితే తన భార్య ప్రణతి తో న్యూయార్క్ మినిట్ దగ్గర నిలబడి ఓ పిక్ తీసుకొని దాని షేర్ చేసి తన ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నానని అయితే పోస్ట్ చేసాడు. దీనితో ఏఈ పోస్ట్ అభిమానుల్లో వైరల్ గా మారింది. ఇక తాను నటించిన గత సినిమా రౌద్రం రణం రుధిరం తో వరల్డ్ వైడ్ భారీ ఫేమ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత వస్తున్న తన 30సినిమాపై నెక్స్ట్ లెవెల్ హైప్ ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు