అన్నపూర్ణలో ఎన్టీఆర్ – పూరి సినిమా షూటింగ్.

jr-ntr-puri-jaganath
యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూరి జగన్నాధ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకరాలలో జరుగుతుంది. స్టూడియోలో వేసిన స్పెషల్ సెట్లో ఎన్టీఆర్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు పూరి జగన్నాధ్. ఆగస్ట్ 2 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయింది. ఎన్టీఆర్ ఆగస్ట్ 11 నుండి షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఎన్టీఆర్ క్యారెక్టర్, యాక్షన్ సీక్వెన్స్ లు చాలా స్టైలిష్ గా డిజైన్ చేసినట్టు సమాచారం. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం భారి ఇంటర్వెల్ బాంగ్ హైలైట్ అవుతుంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ‘బృందావనం’, ‘బాద్ షా’ సినిమాల తర్వాత హట్రిక్ కోసం వీరిద్దరూ వెయిట్ చేస్తున్నారు. మధురిమ సెకండ్ హీరోయిన్. తన కెరీర్లో తొలిసారిగా మరొకరు రచించిన కథకు దర్శకత్వం వహిస్తున్నారు పూరి జగన్నాధ్. వక్కంతం వంశి అందించిన కథకు తన మార్క్ డైలాగ్స్, స్క్రీన్-ప్లేతో ఎన్టీఆర్ ను కొత్తగా చూపించనున్నారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 2015 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version