“సింహాద్రి”తో ఎన్టీఆర్ ర్యాంపేజ్ షురూ.!

Published on May 11, 2023 4:00 pm IST

రీసెంట్ గా టాలీవుడ్ లో స్టార్ట్ అయ్యిన రీ రిలీజ్ ట్రెండ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సెన్సేషనల్ హిట్ చిత్రం “సింహాద్రి” కూడా ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ఈసారి తార ఫ్యాన్స్ నెవర్ బిఫోర్ లెవెల్లో ఈ రీ రిలీజ్ కి ప్లాన్స్ చేసుకున్నారు.

ఇక ఈ చిత్రానికి అయితే ఇప్పుడు మాసివ్ రెస్పాన్స్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ నిన్నటి నుంచి బుకింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఓపెన్ కాగా ఇప్పుడు ఈ షో లు కూడా హౌస్ ఫుల్స్ అయ్యిపోయినట్టుగా తెలుస్తుంది. దీనితో అయితే తన సెన్సేషనల్ హిట్ తో తారక్ మరోసారి ర్యాంపేజ్ చూపిస్తున్నాడని చెప్పాలి.

ఇక పది రోజులు ముందే ఇలా ఉంటే రిలీజ్ డే నాటికి ఈ మేనియా ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ చిత్రాన్ని కూడా ఇండియన్ సినిమా పైనీర్ రాజమౌళి దర్శకత్వం వహించగా ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్ చే రీ రిలీజ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :