ఎన్టీఆర్ కు ప్రణతి ఇచ్చిన సలహాలు !

24th, January 2017 - 04:02:05 PM

ntr
జనతా గ్యారేజ్ చిత్రంతో వచ్చిన భారీ విజయాన్ని తరువాత బాబీ దర్శకత్వంలో నటించబోయో చిత్రంతో కూడా కొనసాగించాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడు.ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ లో తన జీవితాన్ని ప్రభావితం చేసిన అంశం గురించి ప్రస్తావించాడు.

తల్లి తరువాత తన జీవితాన్ని అత్యధికంగా ప్రభావితం చేసిన వ్యక్తి తన భార్య ప్రణతి అని ఎన్టీఆర్ రివీల్ చేశాడు.తమ పెళ్ళైన కొత్తలో సినీవాతావరణానికి అలవాటు పడడానికి ప్రణతికి కొంత సమయం పట్టిందని, ఆ తరువాత ఆమే తనలోని ఈ మార్పు కు కారణమైందని ఎన్టీఆర్ అన్నారు. తాను ఫిట్ గా ఉండడంలో ప్రణతి కీలక పాత్ర పోషించిందని ఎన్టీఆర్ తెలిపారు. తన లుక్ విషయంలో కూడా ప్రణతి తనకు సలహాలు ఇచ్చిందని ఎన్టీఆర్ తెలిపారు.