మాస్ ఎన్టీఆర్ బ్లడ్ ఫ్యాన్ సినిమా టీజర్ కి డేట్ ఫిక్స్.!

Published on Nov 7, 2021 2:00 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మాస్ లో ఏ లెవెల్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. అలాంటి తారక్ కి వీరాభిమానిగా టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న తాజా చిత్రం “అర్జున ఫాల్గుణ”. తన లాస్ట్ సినిమా “రాజ రాజ చోర” చిత్రం హిట్ తో తన నెక్స్ట్ సినిమాలపై డీసెంట్ బజ్ నెలకొంది. అలా ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొనగా ఇప్పుడు మేకర్స్ ఈ సినిమా టీజర్ కి డేట్ ఫిక్స్ చేసేసారు.

ఈ నవంబర్ 9న టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ శ్రీవిష్ణు ది రిలీజ్ చేసారు. శ్రీ విష్ణు చేతికి రక్తంతో తడిచిన కర్చీఫ్.. దానిపై ఎన్టీఆర్ అనే పేరు చూస్తుంటే తారక్ అభిమానులకు ఈ సినిమాలో మంచి ట్రీట్ రెడీగా ఉన్నట్టు అర్ధం అవుతుంది. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు తేజ మర్ని తెరకెక్కిస్తుండగా అమ్రిత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :

More