“ఎన్టీఆర్ 30”..హాట్ టాపిక్ గా తారక్ మాస్ అవతార్.!

“ఎన్టీఆర్ 30”..హాట్ టాపిక్ గా తారక్ మాస్ అవతార్.!

Published on Apr 2, 2023 1:00 PM IST

టాలీవుడ్ సినిమా దగ్గర భారీ క్రేజ్ ఉన్న మాస్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్ళీ తన మాస్ ఛరిష్మా కి తగ్గట్టుగా సాలిడ్ ప్రాజెక్ట్ ని అయితే దర్శకుడు కొరటాల శివతో చేస్తున్నారని చెప్పాలి. మరి రీసెంట్ గానే గ్రాండ్ గా లాంచ్ అయ్యిన ఈ సినిమా నిన్ననే అనుకున్నట్టుగా షూటింగ్ కూడా స్టార్ట్ కావడం పైగా తారక్ నుంచే ఊహించని అప్డేట్ కూడా రావడం అనేది తన ఫ్యాన్స్ కి మరింత కేజ్రీగా మార్చింది.

ఇక ఇదిలా ఉండగా ఈ అవైటెడ్ సినిమాలో తారక్ రోల్ లో ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో కొరటాల ఇది వరకే చెప్పారు. కానీ ఆ రోల్ తాలూకా ఆకృతి ఏ తరహా లో ఉంటుంది ఎంత మాస్ గా ఉంటుంది అనేది ఇప్పుడు క్లారిటీ వచ్చింది అని చెప్పాలి. నిన్న వచ్చిన వీడియో లో అయితే ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతుందో ఆల్ మోస్ట్ అందరికీ అర్ధం అయ్యిపోయింది.

తన డ్రెస్సింగ్ గాని చెవికి పోగులు గాని దీనితో తన రోల్ పక్కా మాస్ అండ్ మంచి డైనమిక్ గా ఉండేలా అనిపిస్తుందని చెప్పాలి. అలాగే తన బాడీ కూడా మళ్ళీ పెంచినట్టు కనిపిస్తున్నాడు. దీనితో ఈ ఊహించని మేకోవర్ అయితే ఇప్పుడు ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు