ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో లంచ్ ఎంజాయ్ చేసిన తన విలన్.!

Published on Oct 13, 2021 4:00 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన గ్రాండ్ రియాలిటీ షో “ఎవరు మీలో కోటీశ్వరులు” షోతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే మరోపక్క బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో చెయ్యబోయే భారీ ప్రాజెక్ట్ కోసం కూడా రెడీ అవుతున్నాడు. అయితే ఇప్పుడు తనకి ఉన్న కోట్లాది మంది అభిమానుల్లో కొంతమందితో ఓ స్టార్ నటుడు కలిసి లంచ్ చేసినట్టుగా తెలిపారు.

అతడు మరెవరో కాదు అరవింద సమేత లో తారక్ కి ఆపోజిట్ గా పవర్ ఫుల్ విలన్ లో కనిపించిన సీనియర్ నటుడు జగపతిబాబు. తన సోషల్ ద్వారా ఓ ఫోటోని జగ్గు భాయ్ ఇప్పుడు షేర్ చేసుకున్నారు. చెన్నై లోని ఓ లోకల్ హోటల్ లో కొంతమంది ఎన్టీఆర్ అభిమానులతో కలిసి లంచ్ ఎంజాయింగ్ గా గడిచింది అని జగపతిబాబు ఆ హ్యాపీ మూమెంట్ ని షేర్ చేసుకున్నారు. దీనితో సోషల్ మీడియాలో మిగతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :