జూ.ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి ఈ నెల 14న మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దీంతో జూ.ఎన్టీఆర్ ఇంట పండుగ వాతావరణం నెలకొంది. తల్లి, బిడ్డ హాస్పిటల్ నుంచి ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంలో ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్ తన చిన్ని తమ్ముడిని ఎంతో ప్రేమగా తన ఒడిలో కూర్చోపెట్టుకుని కెమెరాకి ఫోజ్ ఇచ్చాడు. ఆ సమయంలో ఎన్టీఆర్ తన కుమారులిద్దర్నీ తన ఫోన్లో క్లిక్ మనిపించాడు. అలా ఎన్టీఆర్ ఫోటో తీయడాన్ని వెనకనుండి ప్రణతి క్లిక్ మనిపించారు.
ఆ ఫోటోను ఎన్టీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తన కుమారుడికి స్వాగతం పలుకుతూ ‘ఇన్నోసెంట్ మామ్ ఈ ఫొటో తీసింది. ఎందుకో తెలీదు’ అంటూ కామెంట్ పెట్టాడు. ఎన్టీఆర్ తన మొదటి కుమారుడికి అభయ్ రామ్ అని పేరు పెట్టారు. మరీ తన రెండో కుమారుడికి ఏ పేరు పెడతారో అని ఆయన అభిమానులు ఇప్పటినుంచే ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
