పూర్తి భిన్నత్వం చూపించిన తారక్ !


‘జై లవ కుశ’ చిత్రంలోని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న మూడు పాత్రల్లో రెండవదైన ‘లవ’ కు సంబందించిన ఫస్ట్ లుక్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. మొదట నెగెటివ్ షేడ్స్ ఉన్న ‘జై’ లుక్ ను చూసి ఎంతగానో ఇంప్రెస్ అయిన అభిమానులు ఈ లవ లుక్ ను చూసి కూడా అలానే ఎగ్జైట్ అవుతున్నారు. అలాగే జై, లవ పాత్రల లుక్ విషయంలోనే ఇంత భిన్నత్వం చూపించిన ఎన్టీఆర్ సినిమాలోని నటనలో ఇంకెంత వేరియేషన్ చూపిస్తాడో అని ఇప్పటి నుండే అంచనాలు పెంచేసుకుంటున్నారు.

ఇకపోతే ఈ పాత్ర తాలూకు టీజర్ కూడా త్వరలోనే రిలీజ్ కానుంది. ఆ తర్వాత మూడవ పాత్ర ‘కుశ’ యొక్క లుక్ కూడా రివీల్ కానుంది. దర్శకుడు బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న రిలీజ్ చేయనున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నివేతా థామస్, రాశి ఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.