సైమాలో అభిమానులపై ఎన్టీఆర్ స్పీచ్ వైరల్.!

Published on Sep 16, 2023 10:01 am IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ మాస్ క్రౌడ్ పుల్లర్ హీరోస్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. మరి ఇప్పుడు తన క్రేజ్ ని అయితే గ్లోబల్ వైడ్ గా నెక్స్ట్ లెవెల్లో సెట్ చేసుకోగా ఇప్పుడు భారీ పాన్ ఇండియా సినిమా “దేవర” తో దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో బిజీగా ఉన్నాడు. ఇక మరోపక్క అయితే తన గత చిత్రం RRR విషయంలో ప్రముఖ అవార్డ్స్ సైమా వేడుకల్లో ఉత్తమ నటునిగా అవార్డును అందుకున్నాడు.

అయితే ఆ వేడుకల్లో అవార్డు అనంతరం తారక్ ఇచ్చిన స్పీచ్ అయితే వైరల్ గా మారింది. మెయిన్ గా తన అభిమానులని ఉద్దేశించి ఇచ్చిన ఈ స్పీచ్ లో తారక్ తాను కష్టాల్లో ఉన్నపుడు కింద పడినప్పుడు తనని పట్టుకొని లేపినందుకు తాను కన్నీటి చుక్క రాల్చినపుడు తాము ఏడ్చి తాను నవ్వినవుడు తామూ నవ్విన అభిమాన సోదరులు అందరికీ నా పాదాభివందనాలు చేస్తున్నాను అని తారక్ తెలిపాడు. దీనితో ఈ స్పీచ్ ఇప్పుడు ఫాన్స్ లో వైరల్ గా మారగా ఈ మాటలో అభిమానులు హృదయాలు మరింత ఆనందంతో నిండిపోయాయి.

సంబంధిత సమాచారం :