‘జనతా గ్యారెజ్’ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టిన ఎన్టీఆర్!

nt
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ‘జనతా గ్యారెజ్’ సెప్టెంబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఓ పక్క పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా పూర్తి చేసుకుంటోన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా నేటి నుంచే పెద్ద ఎత్తున మొదలయ్యాయి. ఎన్టీఆర్ స్వయంగా ప్రమోషన్స్‌లో పాల్గొనడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ ఉదయం హైద్రాబాద్‌లోని పలు ప్రధాన ఎఫ్.ఎం. స్టేషన్లలో ఎన్టీఆర్, కొరటాల శివ ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు.

‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ సినిమాలతో తనదైన బ్రాండ్ సృష్టించుకున్న దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. ఇక అందుకు తగ్గట్టే టీమ్ చేపడుతోన్న ప్రమోషన్స్ కూడా ఆ అంచనాలను మరింత పెంచేస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. కొరటాల మార్క్ సోషల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది.