ఇంతటి ఆదరణ చూపిన ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు : ఎన్టీఆర్

8th, September 2016 - 01:00:15 PM

ntr
కొరటాల శివ డైరెక్షన్లో తారక్ నటించిన ‘జనతా గ్యారేజ్’ ముందు నుంచి అనుకున్నట్టే పలు ఇండస్ట్రీ రికార్డుల్ని రిపేర్ చేసేస్తోంది. ఇప్పటికే బాహుబలి తరువాత అత్యంత వేగంగా రూ. 50 కోట్ల మార్కును అందుకున్న చిత్రంగా రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ చిత్రం మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన రెండవ చిత్రంగా మరో ఫీట్ ను సాదించింది. దీంతో జనతా టీమ్ మొత్తం ఖుషీఖుషీగా ఉంది.

ఈ సందర్బంగా హీరో ఎన్టీఆర్ స్పందిస్తూ ‘ప్రేక్షకుల ఆదరాభిమానాలు నా కృతజ్ఞతలు. బాక్సాఫీస్ దగ్గర సినిమా సాధిస్తున్న వసూళ్లు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ముందుగా చెప్పినట్టే ఈ నెంబర్ గేమ్ కు నేను పెద్దగా ప్రాధాన్యం ఇవ్వను. ఒక నటుడిగా మంచి సినిమాల్లో మంచి పాత్రలు చేయడమే నా లక్ష్యం’ అన్నారు. రిలీజ్ రోజున మిశ్రమ ఫలితాలు అందుకున్నప్పటికీ కొరటాల శివ ఎమోషనల్ టేకింగ్, ఎన్టీఆర్, మోహన్ లాల్ ల పరిపూర్ణమైన నటన ఈ సినిమాకు బ్రహ్మాండమైన విజయాన్ని కట్టబెట్టాయి.