ఇంకో రెండు రోజుల్లో ఎన్టీఆర్ ఫైనల్ చేసేస్తాడట !

ntr
‘నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్’ వంటి రెండు బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్లు కొట్టినా కూడా తారక్ ఇంకా తన నెక్స్ట్ సినిమా ఏంటనేది ఇప్పటిదాకా అనౌన్స్ చేయలేదు. కొన్నాళ్ళు వక్కంతం వంశీ, ఇంకొన్నాళ్ళు పూరి జగన్నాథ్ పేర్లు వినిపించగా అవన్నీ పోయి తాజాగా యువ దర్శకులు అనిల్ రావిపూడి కొన్ని రోజులు ఎన్టీఆర్ లిస్టులో చోటు దక్కించుకున్నా తారక్ అతనికి కూడా ఓకే చెప్పలేదు. ఫైనల్ గా ఇప్పుడు ‘పవర్’ ఫేమ్ బాబి పేరు తరచూ వినిపించింది.

బాబి చెప్పిన స్టోరీ లైన్ ఎన్టీఆర్ కు నచ్చి వెంటనే పూర్తి కథ సిద్ధం చేసుకుని రమ్మన్నాడని, బాబి కూడా పూర్తి స్క్రిప్ట్ ను తారక్ కు వినిపించాడని, తారక్ బాబి కథతో పూర్తిగా ఇంప్రెస్ అయ్యాడని, దాదాపు ఓకె చేసినట్టేనని అంటున్నారు. దీనికి సంబంధించి ఇంకో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశముందని అంటున్నారు. మరి ఇన్నాళ్లు ఎన్నో కథలు విని దేనికీ కాంప్రమైజ్ కాని తారక్ ను అంతలా మెప్పించిన బాబి కథ ఏ రేంజులో ఉంటుందో చూడాలి మరి.