
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పడంలో ఎన్.టి.ఆర్ కి కొత్తేమీ కాదు. అంతే కాకుండా ‘స్టూడెంట్ నెం1’ నుంచి ఎన్.టి.ఆర్ పంచ్ డైలాగ్స్ చెబుతూ ఉన్నాడు. ఈ మధ్య కాలంలో కొంతమంది తన డైలాగ్ డెలివరీ ఒకే స్టైల్లో ఉంటోందని విమర్శలు కూడా కురిపించారు.
అలాంటి వారందరికీ ఎన్.టి.ఆర్ త్వరలో రానున్న పూరి జగనాద్ సినిమాతో సమాధానం చెప్పనున్నాడు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ డైలాగ్ డెలివరీ సరికొత్త స్టైల్లో ఉంటుంది. అలాగే ఈ స్టైల్లో హెవీ పంచ్ డైలాగ్స్ చెప్పకుండా చాలా స్మూత్ గా పంచ్ డైలాగ్స్ చెప్పనున్నాడని సమాచారం.
ఎన్.టి.ఆర్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ బండ్ల గణేష్ నిర్మాత. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ ఈ నెల 23 వరకూ గోవాలో జరగనుంది.