ఎక్కడా ఆగేదే లేదంటున్న ఎన్టీఆర్ !


యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జై లవ కుల’ షూటింగ్ ఆఖరి దశకు చేరుకున్న సంగతి విదితమే. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తికాగా ఇంకో మూడు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలుంది. వీటిని కూడా త్వరలోనే మొదలుపెట్టనున్నారు. దీంతో తారక్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం జరక్కుండా ఉండేందుకు తన మూడు పాత్రల తాలూకు డబ్బింగ్ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు.

అందుకే ఈరోజు నుండే డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టనున్నారు. ఇక రెండవ పాత్రైన లవ కుమార్ కు సంబందించిన టీజర్ ను ఈ నెల 25న వినాయక చవితి సందర్బంగా విడుదలచేయనున్నారు. అలాగే మూడవ పాత్ర కుశ యొక్క ఫస్ట్ లుక్, టీజర్ ను కూడా ఈ నెలాఖరుకల్లా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. దర్శకుడు బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో నివేతా థామస్, రాశి ఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే మొదటి నుండి చెబుతున్నట్టే సెప్టెంబర్ 21న చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు.