‘ఘాజీ’ కోసం అమితాబ్, ఎన్టీఆర్..!
Published on Jan 9, 2017 10:21 am IST

amitabh-ntr-in
‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా స్టార్ స్టేటస్‌ను కొట్టేసిన రానా, ఆ సినిమాకు రెండో భాగమైన ‘బాహుబలి ది కంక్లూజన్‌ను పూర్తి చేసి ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ చిత్రం, ఘాజీ అన్న మరో ద్విభాషా చిత్రం చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఘాజీ’ సినిమా ఫిబ్రవరి 17న హిందీ, తెలుగులో ఒకేసారి పెద్ద ఎత్తున విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర కథనం బయటకు వచ్చింది. ఘాజీ సినిమాకు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారట.

అమితాబ్ హిందీ వర్షన్‌కు వాయిస్ ఓవర్ ఇవ్వనుండగా, ఎన్టీఆర్ తెలుగు వర్షన్‌కు ఇస్తారట. ఈ విషయమై టీమ్ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. పీవీపీ సినిమా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. భారతదేశపు మొట్టమొదటి నావికాదళ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా కావడం ఘాజీ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. తాప్సీ ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

 
Like us on Facebook