జూనియర్ ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న భారీ యాక్షన్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తుండగా, మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఎన్టీఆర్ ఓ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ గతంలో నటించిన సినిమాల్లో నటుడు రాజీవ్ కనకాల దాదాపు అన్ని సినిమాల్లో నటించాడు. రాజీవ్ కనకాల ఎన్టీఆర్ సినిమాలో నటిస్తున్నాడంటే, ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అనే సెంటిమెంట్ నందమూరి అభిమానుల్లో ఎప్పటినుంచో ఉంది. ఇక రియల్ లైఫ్‌లో కూడా వీరిద్దరి చాలా మంచి ఫ్రెండ్స్. దీంతో ఇప్పుడు మరోసారి తనకు కలిసొచ్చిన సెంటిమెంట్‌ను తారక్ ఫాలో అవ్వాలని చూస్తున్నాడు.
‘డ్రాగన్’ సినిమాలో కూడా రాజీవ్ కనకాలకు ఓ పవర్ఫుల్ పాత్రను ఇచ్చేందుకు ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ఆలోచిస్తున్నారట. దీనికి రాజీవ్ కనకాల కూడా సై అన్నాడని తెలుస్తోంది. దీంతో త్వరలోనే మరోసారి ఎన్టీఆర్-రాజీవ్ కనకాల కాంబో మనం వెండితెరపై చూడబోతున్నాం. మరి రాజీవ్ కనకాల ఈసారి ఎన్టీఆర్ కోసం ఎలాంటి పాత్రలో కనిపిస్తాడా అనేది వేచి చూడాలి.
