వైభవంగా ప్రారంభమైన ఎన్టీఆర్ కొత్త సినిమా !
Published on Oct 23, 2017 12:24 pm IST


‘జై లవ కుశ’ తో మంచి విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ ఏమాత్రం ఆలస్యం లేకుండా తన కొత్త సినిమాని మొదలుపెట్టేశారు. కొద్దిసేపటి క్రితమే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. వేడుకకు తారక్ భార్యా పిల్లలతో సహా కార్యక్రమానికి విచ్చేయగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరై కొబ్బరికాయ కొట్టి ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ లకు అభినందనలు తెలిపారు. అలా పవర్ స్టార్ చేరికతో వేడుక మరింత విశేషాన్ని సంతరించుకుంది.

ఒకవైపు ఎన్టీఆర్ అభిమానులు, మరొకవైపు పవన్ ఫ్యాన్స్ సినిమాకు శుభాకాక్షలు చెబుతూ సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఈ చిత్రానికి సంగీతం అందివ్వనున్న అనిరుద్, ప్రముఖ నిర్మాత ఎం. శ్యామ్ ప్రసాద్ రెడ్డిగారు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం పవన్ – త్రివిక్రమ్ ల సినిమా పూర్తవగానే రెగ్యులర్ షూట్ కు వెళ్లనుంది. తొలిసారి ఎన్టీఆర్, త్రివిక్రమ్ లు కలిసి పని చేయనుండటంతో ఔట్ ఫుట్ పై భారీ అంచనాలను పెట్టుకున్నారు ప్రేక్షకులు.

 
Like us on Facebook