ఎన్టీఆర్ ఇప్పుడేం చేస్తున్నాడు?

7th, December 2016 - 11:19:01 AM

ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు కెరీర్‌లో మంచి దశలో ఉన్నారు. ఆయన హీరోగా చేసిన గత మూడు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించినవే! ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో విడుదలైన ‘జనతా గ్యారేజ్’ ఎన్టీఆర్ కెరీర్‌కే అతిపెద్ద హిట్‌గా నిలిచి ఆయన క్రేజ్‌ను అమాంతం పెంచేసింది. ఇక ఈ సినిమా విడుదలై ఇప్పటికే మూడు నెలలు దాటిపోయినా ఎన్టీఆర్ తన కొత్త సినిమాను ఇంకా ప్రకటించలేదు. ఈ గ్యాప్‌లో చాలామంది దర్శకులతో సినిమా ఖరారైనట్లు వార్తలు వచ్చినా ఏదీ ఇంకా ఖరారు కాలేదు.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతానికి ఎన్టీఆర్ ఓ కొత్త లుక్ కోసం ప్రయత్నిస్తున్నారట. హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ (హిట్) పేరుతో టోన్డ్ బాడీ కోసం ఎన్టీఆర్ కసరత్తులు చేస్తున్నారట. ఇందుకోసం ప్రత్యేకంగా ట్రైనర్‌ను ఎంపిక చేసుకొని, డైట్ ఫాలో అవుతూ వర్కవుట్స్ చేస్తూ వస్తున్నారట. త్వరలోనే ఎన్టీఆర్ ఇంతకుముందెన్నడూ కనిపించనంత కొత్త లుక్‌లో దర్శనమివ్వనున్నట్లు తెలుస్తోంది. మరి కొత్త లుక్‌లో రెడీ అయి, ఎన్టీఆర్ సెట్స్‌పైకి తీసుకెళ్ళే సినిమా ఏమై ఉంటుందన్నది వేచిచూడాలి.