అభిమానితో వీడియో కాల్ మాట్లాడిన ఎన్‌టీఆర్..!

Published on Oct 26, 2021 2:55 am IST


జూనియర్ ఎన్‌టీఆర్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురుంచి పెద్దగా చెప్పక్కర్లేదు. అభిమానులంటే తారక్‌కి ఎనలేని ప్రేమ, మర్యాద. అందుకే తారక్ అంటే అభిమానులకు కూడా చచ్చేంత ప్రేమ. అయితే తాజాగా చావు బతుకుల మధ్య ఉన్న ఓ అభిమాని కోరిక తీర్చాడు ఎన్‌టీఆర్. అసలు వివరాల్లోకి వెళితే తూర్పు గోదావరి జిల్లాలోని మలికిపురం మండలం గూడపల్లికి చెందిన మురళి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అయితే ఆయన పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆయన ఇష్టాఇష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేయగా, తన అభిమాన హీరో ఎన్‌టీఆర్‌తో ఒక్కసారి మాట్లాడాలని ఉందని చెప్పాడు. ఈ విషయం తారక్‌కి చేరడంతో వెంటనే వీడియో కాల్ చేసి అభిమాని మురళీతో మాట్లాడాడు. ధైర్యంగా ఉండాలని అన్నాడు. ఇదే కాకుండా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మాట్లాడాడు. ఈ సినిమావంబర్? అతని ఫ్యాన్స్ క్లబ్ రూ. 2.5 లక్షలకు పైగా ఆఫర్ చేసింది. దీంతో మురళీ కోలుకుని ఎన్టీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత సమాచారం :

More