అభిమాని కోరిక.. వీడియో కాల్ మాట్లాడిన జూనియర్ ఎన్‌టీఆర్..!

Published on Oct 7, 2021 1:56 am IST


జూనియర్ ఎన్‌టీఆర్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురుంచి పెద్దగా చెప్పక్కర్లేదు. అభిమానులంటే తారక్‌కి ఎనలేని ప్రేమ, మర్యాద. అందుకే తారక్ అంటే అభిమానులకు కూడా చచ్చేంత ప్రేమ. అయితే తాజాగా చావు బతుకుల మధ్య ఉన్న ఓ అభిమాని కోరిక తీర్చాడు ఎన్‌టీఆర్. అసలు వివరాల్లోకి వెళితే తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలుకు చెందిన కొప్పాడి మురళీ ఎన్‌టీఆర్‌కి వీరాభిమాని.

అయితే ఇటీవల కొప్పడి మురళీ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆయన ఇష్టాఇష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేయగా, తన అభిమాన హీరో ఎన్‌టీఆర్‌తో ఒక్కసారి మాట్లాడాలని ఉందని చెప్పాడు. ఈ విషయం తారక్‌కి చేరడంతో వెంటనే వీడియో కాల్ చేసి అభిమాని మురళీతో మాట్లాడాడు. ధైర్యంగా ఉండాలని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఎన్‌టీఆర్ ఆకాంక్షించారు.

సంబంధిత సమాచారం :