మరోసారి ప్రతీ ఒక్కరినీ సర్ప్రైజ్ చేయనున్న తారక్.?

Published on Sep 16, 2021 7:05 am IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన భారీ చిత్రం “RRR” తర్వాత బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో మరో సినిమాకి ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే దీనిని కూడా పాన్ ఇండియన్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారని టాక్ రాగా మరింత హైప్ ఈ చిత్రంపై నెలకొంది. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం త్వరలోనే స్టార్ట్ కానుంది అని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుండగా తారక్ మేకోవర్ కి సంబంధించి మరో ఆసక్తికర ఇన్ఫో కూడా వినిపిస్తుంది.

తన కెరీర్ లో లుక్ పరంగా ఎన్నో సార్లు కొత్తగా ట్రై చేసిన తారక్ తాను మారిన ప్రతీసారి కూడా ప్రతీ ఒక్కరినీ ఎంతగానో ఆశ్చర్యపరిచాడు. అది యమదొంగ కి కావచ్చు, కంత్రీ, టెంపర్ లేటెస్ట్ అరవింద సమేత, “RRR” వరకు కూడా తన డెడికేషన్ ని చూపించారు. అలాగే ఇది వరకు కొరటాలతో చేసిన జనతా గ్యారేజ్ లో కూడా తారక్ లుక్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది.

మరి రీసెంట్ గా భీం లుక్ నుంచి కొరటాల సినిమా లుక్ లోకి మారడం స్టార్ట్ చేసిన తారక్ ఇప్పుడు ఆఫ్ లైన్ లో కనిపిస్తున్న దానికంటే కూడా సినిమాలో ఆశ్చర్యపరుస్తాడట. చాలా స్లిమ్ అండ్ స్టైలిష్ లుక్ తో ఈ సినిమాలో కనిపిస్తాడట. మరి బహుశా ఈ సినిమా ముహూర్త కార్యక్రమంలో కూడా తారక్ ఇలానే ఉండొచ్చని తెలుస్తుంది. మరి ఇస్రాయి తారక్ ఎలా కనిపించనున్నాడో వెయిట్ చేసి చూడాలి.

సంబంధిత సమాచారం :