సైమా అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్..

Published on Sep 16, 2023 7:05 am IST


ఇండియన్ సినిమాకి సంబంధించి ఉన్న పలు ప్రముఖ అవార్డ్స్ లో సైమా అవార్డ్స్ కూడా ఒకటి అని తెలిసిందే. మరి ఎప్పటిలానే ఈ ఏడాది కూడా ఈ అవార్డ్స్ వేడుకలు స్టార్ట్ అయ్యాయి. ఈసారి దుబాయ్ వేదికగా జరిగిన ఈ గ్రాండ్ మూవీ ఫెస్టివల్ లో అయితే మన టాలీవుడ్ నుంచి జరిగిన లీడింగ్ పెర్ఫామర్ జాబితాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి గాను తన గ్లోబల్ సక్సెస్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కి గాను ఉత్తమ నటుడిగా అవార్డ్ దక్కింది.

దీనితో ఈ సైమా వారు ఈ అవార్డు ని తారక్ కి గౌరవప్రదంగా అందజేశారు. దీనితో ఈ వేదికపై ఎన్టీఆర్ మాసివ్ ప్రెజెన్స్ తో ఈ బ్యూటిఫుల్ మూమెంట్ ఇప్పుడు వైరల్ గా మరగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి మరోవైపు తారక్ తన భారీ సినిమా “దేవర” షూట్ లో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :