జూనియర్ ఎన్టీఆర్ వద్దకే HCA స్పాట్‌లైట్ అవార్డు!

Published on Mar 3, 2023 8:00 pm IST


దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR మూవీ పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు. అయితే స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, HCA స్పాట్‌లైట్ అవార్డును అందుకోవడానికి తన సహ నటుడు రామ్ చరణ్, దర్శకుడు SS రాజమౌళి తో రాలేక పోయారు.

ఈరోజు, HCA అవార్డ్స్ జ్యూరీ RRRలో ముఖ్యమైన పాత్రలు పోషించినందుకు జూనియర్ ఎన్టీఆర్ మరియు అలియా భట్ ఇద్దరికీ స్పాట్‌లైట్ అవార్డులను ప్రకటించింది. దీంతో పాటు వచ్చే వారం ఆయా నటీనటులకు అవార్డులను పంపనున్నట్లు ప్యానెల్ ప్రకటించింది. అంటే జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగతంగా ఈ అవార్డును అందుకోరు. మరోవైపు, మార్చి 12, 2023న జరగనున్న ఆస్కార్ ఈవెంట్‌కు హాజరయ్యేందుకు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 5 లేదా 6 తేదీల్లో USA కి వెళ్లనున్నట్లు సోషల్ మీడియాలో బలమైన బజ్ చక్కర్లు కొడుతోంది.

సంబంధిత సమాచారం :