ఎన్టీఆర్ నూతన చిత్ర లోగో ఆవిష్కరణ !


యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకుడు బాబీ డైరెక్షన్లో ఒక సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్న ఈ చిత్రంపై అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ తన నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న చిత్రం త్వరలో చిత్రం యొక్క అధికారిక లోగోను విడుదల చేయనున్నారు.

ఈ విషయాన్ని కళ్యాణ్ రామ్ స్వయంగా తెలుపుతూ ‘ఏప్రిల్ 5 శ్రీరామ నవమి సందర్బంగా ఎన్టీఆర్ 27 లోగోను లాంచ్ చేస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి ‘జై లవకుశ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇకపోతే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని ఆగస్టు నెలలో రిలీజ్ చేసేలా ప్రణాళికను సిద్ధం చేశారు.