హిందీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ 30 మోషన్ పోస్టర్!

Published on May 20, 2022 7:07 am IST

జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ 30 మోషన్ పోస్టర్ నిన్న రాత్రి విడుదలైంది. మరియు దీనికి ప్రేక్షకుల నుండి చాలా సానుకూల స్పందన వచ్చింది. మోషన్ పోస్టర్‌కి వచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదు. కేవలం సౌత్ లో మాత్రమే కాకుండా, ఈ మోషన్ పోస్టర్ హిందీ ప్రేక్షకులను సైతం విశేషం గా ఆకట్టుకుంది.

ఎన్టీఆర్ 30 మోషన్ పోస్టర్ కోసం ఎన్టీఆర్ హిందీ డబ్బింగ్ చెప్పడం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఎన్టీఆర్ 30 కి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. మరో రెండు నెలల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఇప్పటికే జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం ఉండగా, ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రం ఉండనుంది. తాజాగా విడుదల అయిన ఈ మోషన్ పోస్టర్ తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :