ఎన్టీఆర్ 30 షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే!

Published on Jun 28, 2022 8:00 am IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ పుట్టిన రోజున ఇందుకు సంబంధించిన ఒక మోషన్ పోస్టర్ ఇండియా వైడ్ గా వైరల్ అయ్యింది.

అయితే ఈ చిత్రం జూలై నెలలో సెట్స్ మీదకి వెళ్లనుంది అని గతంలో అనేక సార్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొరటాల శివ స్క్రిప్ట్ విషయం లో ఇంకాస్త శ్రద్ద వహించడం తో కాస్త ఆలస్యంగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్ 30 ఆగస్ట్ చివరాఖరున లేదా సెప్టెంబర్ నెలలో మొదలయ్యే అవకాశం ఉంది. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :