ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజిగా “ఎన్టీఆర్30”

ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజిగా “ఎన్టీఆర్30”

Published on Oct 31, 2022 1:56 PM IST

ఎన్టీఆర్ 30కి సంబంధించి ఆన్‌లైన్‌లో అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈరోజు చాలా మీడియా పోర్టల్స్ ఆ సినిమా ఆగిపోయిందని గాసిప్‌ని ప్రచారం చేశాయి. అయితే ఈ సినిమాపై ఓ క్లారిటీ వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్ర దర్శకుడు కొరటాల శివ, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ మరియు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పాల్గొన్న ప్రీ ప్రొడక్షన్ వర్క్ భారీ స్థాయిలో వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కథానాయిక మరియు ఇతర వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత చేస్తున్న చిత్రం కావడం తో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు