నిన్న రాత్రి సెట్స్ పైకి ‘ఎన్టీఆర్’ !

Published on Mar 27, 2023 5:41 pm IST

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా లాంఛనంగా మొదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. నిన్న రాత్రి ఈ సినిమా సెట్స్ పైకి వచ్చింది. ఎన్టీఆర్ పై కొన్ని ప్రత్యేకమైన మాంటేజ్ షాట్స్ తీశారు. ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు బయటపెట్టారు. మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ తో కలిసి దిగిన ఫొటోల్ని ఆయన షేర్ చేశారు. ఇక ఎన్టీఆర్ సినిమా సెట్ బ్యాక్ గ్రౌండ్ లో ఓ భారీ బోటు సెట్ కనిపిస్తోంది.

హాలీవుడ్ స్టార్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఈ సినిమాకు కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలు కంపోజ్ చేయబోతుండటం విశేషం. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది. అలాగే ఓ కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోతోందట. అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం తారక్ కూడా డిఫరెంట్ మేకోవర్‌ ట్రై చేస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై రాబోతోంది ఈ మూవీ. ఈ సినిమాను తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏప్రిల్ 5, 2024న రిలీజ్ చేయబోతున్నారు.

సంబంధిత సమాచారం :