“ఎన్టీఆర్ 31” ను వేరే లెవెల్ లో ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్…ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!

Published on May 20, 2022 12:51 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్, సినీ పరిశ్రమ కి చెందిన వారు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. నేడు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో చేయబోయే చిత్రం కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. కేజీఎఫ్ సిరీస్ చిత్రాల సెన్సేషనల్ డైరెక్టర్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చూస్తే ఎన్టీఆర్ సిసలైన మాస్ రూపాన్ని ఈ చిత్రం లో చూడనున్నట్లు తెలుస్తుంది. పాన్ ఇండియా చిత్రం కావడం తో ఈ సినిమా వేరే లెవెల్ లో ఉండబోతుంది అని పోస్టర్ ను చూస్తే తెలుస్తుంది.

ఎన్టీఆర్ 31 పేరుతో తారక్ చేయబోయే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో పెద్ద మీసాలు మరియు తీక్షణమైన కళ్లతో జూనియర్ ఎన్టీఆర్‌ ఉన్నారు. ఇంటెన్స్ లుక్ తో పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది. ఈ పోస్టర్ ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ పాన్ ఇండియా సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 2023 లో ప్రారంభమవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ యాక్షన్ డ్రామాని ఎన్టీఆర్ ఆర్ట్స్‌తో కలిసి భారీ స్థాయిలో బ్యాంక్రోల్ చేస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో ప్రతిభావంతులైన తారాగణం మరియు సాంకేతిక నిపుణులు ఉన్నారు. అనే వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :