కీలక సన్నివేశాల చిత్రీకరణలో ‘జై లవ కుశ’ !


యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తాజా చిత్రం ‘జై లవ కుశ’. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో తారక్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. దీంతో సినిమాపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ స్థాయి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే ఒక కీలక షెడ్యూల్ పూర్తి చేసిన చిత్ర టీమ్ ఈరోజు నుండి హైదరాబాద్లో షూటింగ్ ను తిరిగి ప్రారంబించనుంది.

ఈ షెడ్యూల్ కోసం నగరంలో ఒక భారీ బంగ్లా సెట్టింగ్ ను ఏర్పాటు చేశారట. అందులోనే సినిమాకు కీలకమైన ఇంటర్వెల్ సీక్వెన్స్ షూట్ చేస్తారని, ఆ సన్నివేశాలు హెవీ యాక్షన్ తో కూడి ఉంటాయని తెలుస్తోంది. ఇకపోతే ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, నివేత థామస్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.