‘జై లవ కుశ’ షూటింగ్ అప్డేట్ !
Published on Jul 3, 2017 5:04 pm IST


జూ.ఎన్టీఆర్ చేస్తున్న ‘జై లవ కుశ’ చిత్రంపై తెలుగు సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది రిలీజ్ కావలసిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈ సినిమాలో తారక్ త్రిపాత్రాభినయం చేస్తుండటంతో అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. దర్శకుడు బాబీ కూడా ఆ అంచనాలను అందుకునేలా అన్ని రకాల థ్రిల్లింగ్ అంశాలతో సినిమాను రూపొందిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. అక్కడే తారక్ తో పాటు ఇతర ముఖ్య తారాగణం పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ చిత్ర టీజర్ ను కూడా మూడు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. వాటిలో మొదటగా ‘జై’ పాత్రకు సంబందించిన టీజర్ ను ఈ నెల 6న విడుదల చేసి ఆ తర్వాత ‘లవ’, ‘కుశ’ పాత్రలకు సంబందించిన టీజర్ లను కూడా సరైన తేదీలు చూసి వరుసగా విడుదచేయనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, నివేత థామస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 21న విడుదల చేయనున్నారు.

 
Like us on Facebook