నందులతో నిండిపోయిన ఎన్టీఆర్ గ్యారేజ్!

15th, November 2017 - 08:59:25 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘జనతా గ్యారేజ్’ చిత్రం ఆయన కెరీర్లోనే ఉత్తమ చిత్రంగా నిలవడమేగాక అవార్డుల వేటలో కూడా సత్తా చాటింది. 2016లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే 7 నంది అవార్డులను ఖాతాలో వేసుకుంది. గతంలో జరిగిన నేషనల్ ఫిలిం ఫేర్ అవార్డ్స్, సౌత్ ఇండియా ఫిలిం ఫేర్ అవార్డ్స్, సౌత్ ఇండియా ఫిలిం ఫేర్ అవార్డ్స్ వేడుకల్లో పలు విభాగాల్లో అవార్డులను ఈ చిత్రం కైవసం చేసుకుంది.

నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల జాబితాలో కూడా ఈ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్, మోహన్ లాల్ లు అవార్డులు గెలుచుకోగా, ఉత్తమ గీత రచయితగా రామజోగయ్య శాస్త్రి, ఆర్ట్ డైరెక్షన్ విభాగంలో ఏ.ఎస్ ప్రకాష్, ఉత్తమ గీతంగా ప్రణామం ప్రణామం ఎంపికయ్యాయి. దీంతో మొత్తం ఏడు నందులు జనతా గ్యారేజ్ కు దక్కాయి. ఈ అవార్డుల పంటతో ఈ చిత్రం ఎన్టీఆర్, దర్శకు కొరటాల శివల కెరీర్లోనే ఎప్పటికీ మర్చిపోలేని చిత్రంగా నిలిచిపోయింది.