సూపర్ హిట్ దర్శకుడితో మరో సినిమా చేయనున్న ఎన్టీఆర్ !


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘జై లవ కుశ’ చిత్రాన్ని చేస్తున్న తెలిసిందే. ఈరోజు తారక్ పుట్టినరోజు సందర్బంగా ఆ చిత్రం యొక్క ఫస్ట్ లుక్స్ ని నిన్న మధ్యాహ్నం రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్స్ కి అభిమానుల నుండి విశేష స్పందన దక్కింది. ఇకపోతే ఈ పుట్టినరోజు సందర్బంగా ఎన్టీఆర్ యొక్క 29వ ప్రాజెక్ట్ ఎవరితో అనేది కూడా అనౌన్స్ చేయబడింది.

వరుసగా హ్యాట్రిక్ హిట్లందుకుని పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ గా మారిన కొరటాల శివ తారక్ యొక్క 29వ సినిమాని డైరెక్ట్ చేయనున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘జనతాగ్యారేజ్’ చిత్రం భారీ విజయాన్ని సొంతం సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ మిక్కిలినేని సుధాకర్ తన యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. ప్రస్తుతం కొరటాల శివ మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రానికి సిద్దమవుతుండగా ఎన్టీఆర్ సినిమాను 2018లో మొదలుపెట్టే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.