కొరటాల కథలో ఎన్టీఆర్ కీలక మార్పులు !

Published on May 26, 2022 7:01 am IST

‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ – క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రాబోతున్న పాన్ ఇండియా సినిమాకు సంబంధించి ఒక అప్ డేట్ తెలుస్తోంది. ఈ చిత్రం కథ పై మళ్లీ వర్క్ స్టార్ట్ అయ్యింది. కథాచర్చల్లో ఎన్టీఆర్ కూడా పాల్గొంటున్నాడు. ఎన్టీఆర్ కి స్క్రిప్ట్ పై మంచి పట్టు ఉంది. కథలో మలుపుల దగ్గర నుంచి ఎమోషన్ వరకూ అన్నీ ఆలోచిస్తాడు. మొత్తానికి కొరటాల చెప్పిన కథలో ఎన్టీఆర్ కీలక మార్పులు చేస్తున్నాడు.

ఇక మొదట ఈ సినిమా జూన్‌లో సెట్స్‌పైకి వస్తుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా షూటింగ్ ఇంకా ఆలస్యం కానుంది. ఈ చిత్రం ఆగస్టులో సెట్స్‌ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో తన పాత్ర కోసం తారక్ డిఫరెంట్ మేకోవర్‌ ట్రై చేస్తున్నారు. ఈ సినిమా కోసం 8-9 కిలోల బరువు తగ్గనున్నాడు తారక్. కాగా ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అన్నట్టు 2023 సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :