‘కొరటాల – ఎన్టీఆర్’ సినిమా ఇంటర్వెల్ ఇదే !

Published on Jun 20, 2022 9:00 am IST

‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ – క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రాబోతున్న పాన్ ఇండియా సినిమాకు సంబంధించి ఒక అప్ డేట్ తెలుస్తోంది. ఈ చిత్రంలో ఓ కీలక ఎపిసోడ్ కోసం భారీ సెట్ ను నిర్మిస్తున్నారు. ఇంటర్వెల్ లో వచ్చే ఈ సెట్ బ్లాస్ట్ సీన్ లో ఎన్టీఆర్ యాక్షన్ అదరిపోతుందట. తారక్ ను గతంలో ఎన్నడూ ఈ స్థాయి యాక్షన్ మోడ్ లో చూడలేదట. మొదట ఈ సన్నివేశం ప్లేస్ లో సముద్రంలో జరిగే ఓ భారీ ఫైట్ ఉండేది. దాని ప్లేస్ లో ఈ సీన్స్ ను లేటెస్ట్ గా యాడ్ చేశారని తెలుస్తోంది.

ఇక మొదట ఈ సినిమా జూన్‌లో సెట్స్‌పైకి వస్తుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా షూటింగ్ ఇంకా ఆలస్యం కానుంది. ఈ చిత్రం ఆగస్టులో సెట్స్‌ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో తన పాత్ర కోసం తారక్ డిఫరెంట్ మేకోవర్‌ ట్రై చేస్తున్నారు. ఈ సినిమా కోసం 8-9 కిలోల బరువు తగ్గనున్నాడు తారక్. కాగా ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అన్నట్టు 2023 సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :