యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇటీవలే తండ్రి అయిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే.. జూలై 22వ తేదీన ఎన్.టి.ఆర్ – ప్రణతి దంపతులకు పండంటి మగబిడ్డ పుట్టాడు. ఆ రోజు నుంచి ఎన్.టి.ఆర్ మరింత ఆనందంగా ఉన్నాడు. ఆ శుభవార్తని తన అభిమానులతో షేర్ చేసుకోవాలని 4 సంవత్సరాల తర్వాత ఎన్.టి.ఆర్ మళ్ళీ ట్విట్టర్లో అడుగు పెట్టాడు. కొద్ది సేపటి క్రితమే తన కుమారుడి పేరు అభయ్ రామ్ అని పెట్టామని తెలియజేశాడు.
‘చాలా హ్యాపీగా ఉంది. కొద్ది సేపటి క్రితమే నా కుమారుడు అభయ్ రామ్ నామకరణం కి మంచి ముహూర్తాన్ని ఫిక్స్ చేసామని’ ఎన్.టి.ఆర్ ట్వీట్ చేసాడు. ఈ పేరుకి అభిమానుల నుంచి పూర్తి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
ఇది కాకుండా ఎన్.టి.ఆర్ నటించిన రభస సినిమా ఈ నెల 29న గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్న ఈ సినిమాలో సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటించారు.
