
ఆయన మనతో లేకపోయినా ప్రపంచ నలుమూలల్లోని తెలుగు వారంతా అన్న అని పిలుచుకునే ఏకైన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. లెజెండ్రీ యాక్టర్ మరియు టిడిపి పార్టీ అధినేత ఎన్.టి.ఆర్ విగ్రహాని అమెరికాలో పెట్టనున్నారని ఇది వరకే తెలియజేశాం. అమెరికాలోని కాలిఫోర్నియాలో శ్రీకృష్ణుడు అవతారంలో ఉన్న ఎన్.టి.ఆర్ విగ్రహాన్ని జూలై 5న తేదీన ఓపెన్ చేయనున్నారు. ఇండియన్ అర్బన్ డెవలప్ మెంట్ యూనియన్ మినిస్టర్ ఎం వెంకయ్య నాయుడు నార్త్ అమెరికా తెలుగు అసోషియేషన్ సెలబ్రేషన్స్(తానా) లో పాల్గొని అక్కడ ఎన్.టి.ఆర్ విగ్రహాన్ని ఓపెన్ చేస్తారు.
ఈ ఎన్.టి.ఆర్ విగ్రహాని పంచలోహాలతో రూపొందించారు. తూర్పు గోదావరికి చెందిన ఫేమస్ విగ్రగా రూపకర్త రవికుమార్ ఉదైయర్ ఈ విగ్రహాన్ని తయారు చేసాడు. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన లెజెండ్ ఎన్.టి.ఆర్ ఘనత ఇప్పుడు అమెరికాలో కూడా ప్రభవిస్తుంది. వెంకయ్య నాయుడు జూలై 3న ప్రారంభమయ్యే తానా సెలబ్రేషన్స్ ని ప్రారంభించనున్నాడు. అలాగే ఆయన్ని తానా వారు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డుతో సత్కరించనున్నారు.