“లైఫ్‌ ఆఫ్ 3” నుండి “నువ్వు నాకు న‌చ్చావే” సాంగ్ విడుద‌ల‌

Published on Oct 21, 2021 10:00 am IST

ప్రముఖ సంగీత దర్శకుడు, యాడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ శశి ప్రీతమ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం
లైఫ్‌ ఆఫ్ 3. స్నేహాల్‌ కామత్‌, వైశాలి, సంతోష్‌ అనంతరామన్‌, చిన్నికృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. శ‌శి ప్రీత‌మ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ ప్లే అందించడంతో పాటు ఛాయాగ్రహణ, సంగీత, దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వర్తించారు. ఆయ‌న కూతురు ఐశ్వర్య కృష్ణ ప్రియ ఈ సినిమా ను నిర్మించడం జరిగింది. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి నువ్వు నాకు న‌చ్చావే పాట‌ను కూడా విడుద‌ల చేయడం జరిగింది.

ఈ పాట‌కు శ‌శి ప్రీత‌మ్ అంద‌మైన బాణీల‌ను స‌మ‌కూర్చారు. ఎన్‌సీ కారుణ్య ఆల‌పించారు. ఈ పాట ప్ర‌స్తుతం సంగీత ప్రియుల్ని అల‌రిస్తూ సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

ఈ సందర్భంగా శ‌శి ప్రీత‌మ్ మాట్లాడుతూ, “ఈ కథ ప్ర‌ధానంగా ముగ్గురు వ్యక్తుల జీవితం గురించి ఉంటుంది. సినిమా ప‌రిశ్ర‌మకు చెందిన ముగ్గురు వ్య‌క్తులు దర్శకుడు, రచయిత మరియు నటుడి జీవితంలో జ‌రిగే సంఘ‌ట‌న‌ల ఆధారంగా సినిమాను తెర‌కెక్కించ‌డం జ‌రిగింది. ఇది హార‌ర్ ఎలిమెంట్స్‌తో కూడిన సస్పెన్స్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ స్టోరీ. సినిమా ఆధ్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతుంది” అని అన్నారు.

స్నేహాల్‌ కామత్‌, సంతోష్‌ అనంతరామన్‌, చిన్నికృష్ణ, వైశాలి, సౌజ‌న్య వ‌ర్మ‌, సీవీఎల్‌, లోహిత్ కుమార్‌, వైభ‌వ్ సూర్య‌, జోసెఫ్ సుంద‌ర్ త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More