లేటెస్ట్…శరవేగంగా “ఓదెల2” షూటింగ్!

లేటెస్ట్…శరవేగంగా “ఓదెల2” షూటింగ్!

Published on May 11, 2024 11:00 PM IST

సూపర్‌హిట్ OTT చిత్రం ఓదెల రైల్వే స్టేషన్‌కి సీక్వెల్ అయిన ఓదెల 2 చిత్రం ను కాశీలో ప్రకటించారు మేకర్స్. అశోక్ తేజ దర్శకత్వంలో సంపత్ నంది రూపొందించిన ఈ చిత్రాన్ని మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్‌లపై డి మధు నిర్మిస్తున్నారు. మహా శివరాత్రి సందర్భంగా తమన్నా శివశక్తి పాత్రలో నటిస్తున్న చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా, చాలా మంచి స్పందన లభించింది.

తమన్నా పాత్రకి సంబందించిన మేకింగ్ వీడియో ను మేకర్స్ రిలీజ్ చేయగా, సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. మేకర్స్ ఇదే విషయాన్ని తాజాగా సోషల్ మీడియాలో వెల్లడించారు. రెండు వర్కింగ్ స్టిల్స్ ను రిలీజ్ చేశారు. సౌందర్ రాజన్ ఎస్ కెమెరామెన్ గా వ్యవహరిస్తుండగా, కాంతార ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు. రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్. తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, మరియు పూజా రెడ్డి లు నటిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు