డైరెక్టర్ సంపత్ నంది బర్త్ డే ను సెలబ్రేట్ చేసిన “ఓదెల 2” టీమ్!

డైరెక్టర్ సంపత్ నంది బర్త్ డే ను సెలబ్రేట్ చేసిన “ఓదెల 2” టీమ్!

Published on Jun 20, 2024 9:02 PM IST

సూపర్‌హిట్ ఓటిటి చిత్రం ఓదెల రైల్వే స్టేషన్‌కి సీక్వెల్ అయిన ఓదెల 2 చిత్రం ను కాశీలో ప్రకటించారు మేకర్స్. అశోక్ తేజ దర్శకత్వంలో సంపత్ నంది రూపొందించిన ఈ చిత్రాన్ని మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్‌లపై డి మధు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తమన్నా శివశక్తి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

నేడు డైరెక్టర్ సంపత్ నంది పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను మేకర్స్ సోషల్ మీడియా లో షేర్ చేయడం జరిగింది. సౌందర్ రాజన్ ఎస్ కెమెరామెన్ గా వ్యవహరిస్తుండగా, కాంతార ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు. రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్. తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, మరియు పూజా రెడ్డి లు నటిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు