100కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ‘ఒడియన్’ !

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం ‘ఒడియన్’ కొత్త రికార్డును సృష్టించింది. మాలీవుడ్ చరిత్రలో 100కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఈ విషయాన్ని దర్శకుడు శ్రీకుమార్ మీనన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. భారీ బడ్జెట్ తో తెరెకెక్కిన ఈ చిత్రం అక్కడ రికార్డు స్థాయిలో విడుదలకు సిద్ధమైంది. ఏకంగా 400 ఫాన్స్ షోస్ పడనున్నాయి.

ఆశీర్వాద్ సినిమాస్ నిర్మించిన ఈ చిత్రంలో మోహన్ లాల్ డిఫ్రెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. ఇటీవల విడుదలైన ఈచిత్రం యొక్క ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఇక ఈ చిత్రం మళయాళంతో పాటు తెలుగు, తమిళం లో డిసెంబర్ 14న విడుదలకానుంది. ఈ చిత్రానికి తెలుగులో కూడా మంచి బిజినెస్ జరిగింది.

Exit mobile version