భారతీయ సినిమా నుంచి ఎన్నో అంచనాలు సెట్ చేసుకొని వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటే ‘రామాయణ’. దర్శకుడు నితీష్ తివారి, రణబీర్ కపూర్ అలాగే సాయి పల్లవి కలయికలో యశ్ విలన్ గా నటించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ దీపావళి కానుకగా విడుదల కాబోతుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా మేకర్స్ ఈ సినిమాని ఒకో చోట ఒకో డేట్ లో విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.
కానీ మరో పక్క గాడ్జిల్లా ఫీవర్ కూడా ఉండడంతో ఇప్పుడు ప్లాన్ లు మారాయి. ఇక ఇలా ఫైనల్ గా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా నవంబర్ 5న విడుదల చేస్తున్నట్టుగా ఖరారు చేశారు. దీనికి ముందు ఇండియాలో ఈ సినిమాని నవంబర్ 6 విడుదల అంటూ కన్ఫర్మ్ చేశారు.
కానీ ఇప్పుడు ఫైనల్ గా ఈ బిగ్ ప్రాజెక్ట్ ఇక్కడ కూడా నవంబర్ 5 ఫుల్ ఫ్లెడ్జ్ విడుదలతో పాటుగా నవంబర్ 4 సాయంత్రం నుంచే ప్రీమియర్స్ తో ఈ సినిమా మొదలు కానుంది. ఇక అంతే కాకుండా ఈ స్దసరా నుంచి సినిమా బుకింగ్స్ ఓపెన్ చేయనున్నట్టు మేకర్స్ ఖరారు చేశారు. సో మొత్తానికి ఎపిక్ ని కొంచెం ముందే విట్నెస్ చేయనున్నామని చెప్పొచ్చు.
