అఫీషియల్ : “ఆదిపురుష్” ట్రైలర్ డేట్ ఫిక్స్.!

Published on May 6, 2023 9:01 am IST

ప్రస్తుతం పాన్ ఇండియన్ సినిమా అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “ఆదిపురుష్” కోసం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ బిగ్గెస్ట్ విజువల్ ట్రీట్ ని అయితే దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించగా గత కొన్ని రోజులు నుంచి అయితే ఈ సినిమా ట్రైలర్ టాపిక్ తోనే సోషల్ మీడియా మరియు సినీ వర్గాలు కమ్మేశాయి.

ఇక ఈ ట్రైలర్ రిలీజ్ పై కొన్ని డేట్స్ బాగా వినిపిస్తూ వచ్చాయి. మరి ఇప్పుడు ఈ మే 9 నే ఈ అవైటెడ్ ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ బిగ్గెస్ట్ అనౌన్సమెంట్ ని అయితే ఇచ్చేసారు. దీనితో ఈ అవైటెడ్ ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ వచ్చినట్టే అని చెప్పాలి. ఆల్రెడీ ట్రైలర్ కి 3డి, మరియు 2డి లలో భారీ స్థాయిలో థియేట్రికల్ రిలీజ్ ప్లాన్స్ నడుస్తున్నాయి. అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్న ఈ గ్రాండ్ విజువల్ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :