అఫీషియల్ : ఈ సెన్సేషనల్ డైరెక్టర్ తో ఐకాన్ స్టార్ నెక్స్ట్.!

Published on Mar 3, 2023 8:04 am IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ హైప్ ఉన్న సీక్వెల్ ఏదన్నా ఉంది అంటే ఆ చిత్రం డెఫినెట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న అవైటెడ్ చిత్రం “పుష్ప 2” అనే చెప్పాలి. మరి ఈ సినిమా తర్వాత ఐకాన్ స్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏది అనే దానికి సంబంధించి నిన్న రాత్రి నుంచే బన్నీ టీం నుంచి సాలిడ్ అప్డేట్స్ బయటకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అధికారిక అప్డేట్ అయితే ఇప్పుడు వచ్చేసింది.

మరి బన్నీ నెక్స్ట్ ని అయితే మన టాలీవుడ్ సెన్సేషన్ అండ్ లేటెస్ట్ పాన్ ఇండియా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేయనున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. ఇదొక ఊహించని సెన్సేషనల్ కాంబో అని చెప్పాలి. ఈ కాంబినేషన్ ఇది వరకే పడాల్సి ఉంది. కానీ ఇప్పుడు అయితే పర్ఫెక్ట్ అని చెప్పాలి. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని బాలీవుడ్ భారీ నిర్మాణ సంస్థ టి సిరీస్ వారు అయితే తెరకెక్కించనున్నారు. మరి ఈ సినిమా ఎన్ని సంచలనాలు సెట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :