అఫీషియల్: దేవర మేకర్స్ తో బాలయ్య X కొరటాల ప్రాజెక్ట్ ఖరారు.. ఇక ఊచకోతే

గత కొన్ని రోజులు నుంచి టాలీవుడ్ లో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్న సాలిడ్ బజ్ నటసింహం బాలకృష్ణ అలాగే స్టార్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ కోసం అని చెప్పాలి. వీరి ఇద్దరి కలయికలో ఓ సినిమా అధికారికంగా అనౌన్స్ అవుతుంది అని వచ్చిన టాక్ నందమూరి అభిమానుల్లో కొత్త ఊపు తెచ్చింది.

తారక్ తో దేవర సినిమా తీసి భారీ హిట్ కొట్టిన కొరటాల ఈ సినిమా పార్ట్ 2 గాప్ లో బాలయ్య 112వ సినిమా డైరెక్ట్ చేయనున్నారు అని వచ్చిన టాక్ క్రేజీగా మారింది. అయితే ఫైనల్ గా దీనిపై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేసారు. ఇది మాత్రం అభిమానులకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

ఇక ఈ సినిమాని కూడా దేవర మేకర్స్ యువసుధ ఆర్ట్స్ వారే నిర్మాణం వహిస్తుండడం విశేషం. వారితో పాటుగా ఎస్ ఎల్ వి సినిమాస్ వారు కూడా నిర్మాణం వహిస్తున్నారు. సో బాలయ్యతో కొరటాల ఎలా ప్లాన్ చేశారో చూడాలి. ఈ సినిమా షూట్ అతి త్వరలోనే మొదలు కానుంది.

Exit mobile version